Skip Navigation Links


యాతన

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 13-05-13 01:50:00

'కవాతుకి అలవడి మొరాయిస్తున్న కలంఈ రాత్రికి మాత్రం విహ్వలించాలి. కోపంతో అరవాలి. వెక్కి వెక్కి ఏడ్వాలి.పుక్కిళ్ళ రక్తాన్ని కక్కాలి ఉరేసుకున్న కల కళేబరాన్ని గుండెల్లో మోస్తూ,నడుచుకుపోతున్న వెన్నులో గుచ్చుకునేలాపాట ఒకటి కట్టాలి విరిగిపడ్డ పాళీని తెల్లారికి అతుకు పెట్టాలి'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా)

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 08-09-12 05:29:00

'“కాలం లో క్షణాలు కోతుల్లా గంతులు వేస్తున్నాయి.  రామదండు లా సహకరించటం లేదు,”  అని 'సూత్రధారులు' లో నిర్వేదం లో ఉన్న ఒక పాత్ర అంటుంది. రేపటి మీద ఎలాంటి ఆశా లేని నిర్లిప్తత అతనిలో గోచరిస్తుంది.  కాలం తీసుకునే బాధ్యతలు మనిషిగా నా బలహీనత ని వెక్కిరించాయి.  ఏ క్షణం ఈసడింపుకి బలి చేస్తుందో?  మరి ఏ క్షణం ఊతమిచ్చి లేపుతుందో? కాలాన్ని క్షణాల్లో లెక్కించాలా?  క్షణాల పోగులతో అల్లిన బట్టగా కొలవాలా? ఏమో? ఏమో? ఏమో?  అలాగే “మనిషి రేపు కొరకు ఎదురుచూస్తాడు,  శ్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బుజ్జితల్లి

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 03-09-12 03:11:00

'అంతదాకా జరిగిన ఘటనలు మర్చిపోయానునిజానికి గుర్తుండేవేవీ జరగనూ లేదీ రోజుఆ చిన్ని కళ్ళ కాంతికిమా నడుమ దూరమేనీడగా నా మీద వాలినట్టుగా ఉందిఅలవాటైన అలవోకడతో అమ్మ భుజమెక్కినాకోసమో ఆత్మీయ కరచాలనం అందిస్తూ...'బుజ్జితల్లి' అవును అచ్చంగా అదొక 'బుజ్జితల్లి'బారలు జాపిన నా చేతుల్లో ఆ బుజ్జాయిఅనుకోకుండా ఆకాశం లోకి చూసానుఏ దేవతా పుష్పం రాలిపడిందోనని అబ్బరంగాబుల్లి పాదాల కేళికి పరవశించిఉయ్యాల పరుపుగా మారిపోవాలని ఊహ కలిగిందిగుప్పిళ్ళు కూరిన నోట సొంగ, చొల్లుమాటలుఒకదాని వెంట ఒకటి, చెప్పలేని హాయిఅందినంతవ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వెనక్కి వెళ్ళే రైలు

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 30-08-12 12:35:00

'"తెలుగు వెలుగు" పత్రిక సెప్టెంబరు మాస సంచికలో ప్రచురితం '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శిధిలజీవి

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 23-08-12 01:56:00

'జీవితాన్ని నిశీధిగా ఎంచి, కలల మినుకులకి,  రాలిపడే శకలాల పోలు ఆనందాలకి అర్రులు చాచి,బధిరుడినై, బాధితుడినై, బంధితుడినైరసావేశ మానసాన వేగితిని, శుష్క యోచనల చిక్కితి.భగ్న పుఠల పీఠిక సమస్తం నలిగిన ప్రేమాన్వేషణలేనాయేనిర్మాల్యము తొలిగిన మానసం కఠినశిలాసదృశ్యమాయేస్వస్థానపు జాడలు వెదుకుతు అలిసితి, అంతఃకరణ లో అనంత సౌందర్యపు ఆనవాళ్ళు కంటి,మహానంద బ్రహ్మము కలదని విశ్వసించితి.శ్వాసనిశ్వాస లయలో నిజ స్పృహ కలిగి చరింతునికపై,హృదయ పర్ణశాల లో ఆశ్రమ వాసినై తపము చేసెద అను నిత్యం.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ముక్తాఫలం

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 18-08-12 14:30:00

'అరివేణి కుండల్లా మబ్బులుపట్టుకుచ్చిళ్ళ పోలిన వాననీటి మెరుపులుమల్లె కుదురులో పన్నీరుబుడ్డి హొయలువడిబియ్యపుమూటల్లే కొమ్మనంటున్న పనసపండుపుప్పొళ్ళ వన్నెల్లో పసుపుకుంకుమలుచూడు, మనసు ఎన్ని జాడలు వెదికిపట్టుకుందో!మేని జలదరింపు మాత్రం నీ వేలికొసల్లో దాగునుందిఒక కంటి నీలాలు మరొకరి దోసిట ముత్యాలు అవుతుంటాయిఆ పెదవి చెమరింపు ఈ చెక్కిట గోమేధికంపాపిట చేరిన ముద్దు మల్లె మొగ్గల్లే కులికితేనుదుటన చేరిన ముద్దు సింధూరమై వెలుగుతుందితమకపు కళ్ళలో తళుకు కెంపుల రాశిపరవశాన పాడేటి పెదవి రంగు పగడంనీ సన్నిధి న(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పునర్మిలనం

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 31-07-12 06:38:00

'విప్పని బొండుమల్లి గుప్పిళ్ళలోబిగిసిన ఉంగరం,విప్పారిన బోసినవ్వు వెలిగించినదీపశిఖ అమ్మ మోముపాలపన్ను పదునుకిపగిలి రాలిన పగడపు రాయి,చురుక్కుమన్న వేలి చుట్టూలేత అరిటాకు చేయి చుట్టుకునినవ్వేసుకున్నదీ అమ్మే...అమ్మాయి ఎదిగిపోయిందికంబళిలా పరుచుకున్న ఆమె ఒడిలోపూలచెండులా మూడో తరంపూర్తిగా విప్పిన ఈ అమ్మ అరచేతరాయి ఊడిన ఉంగరంఅమ్మనాటి చేష్టకి అస్తిత్వంచిన్నతనపు లాలిపాటకిచిక్కని కన్నీటికి పునర్మిలనం'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ముసాబు

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 09-07-12 19:12:00

'జాజి కుదుళ్ళలో పొడిచి, తొలిచిన గుటక పడ్డాక కాబోలుపూరేకు కొసల వానచుక్క పెట్టిన చక్కిలిగింత తెలిసింది,రవ్వంత సిగ్గుతో, ఎగరలేక నేలబారుకి జరుగుతూ పోయిందో పిచ్చుకబోసి బుగ్గల పాలచుక్కల బూరలు ఊదే బిడ్డలా, గొంగళి కూనొకటిఆకు పక్కల్లో దోగాడుతూ, చిల్లుల మీదుగా పొల్లిగింతలు వేస్తుందిపొడిబారిన కొబ్బరిపువ్వు, ముదిరిన ముంజలుముగిసిన వేసవి పంపిన దూతల్లా ఉన్నాయివాలిన నారింజ కొమ్మల్లోకి తొలకరి జల్లులు తూలిపడుతున్నాయిసగం రాత్రి వరకు కీచురాళ్ళ రొద, పగటి నిద్రకి ఈగల బెడదఆషాఢ పోకడల్లో అలిసిన గోరింట కొమ్మ (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఉత్ప్రేక్ష

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 02-06-12 05:18:00

'నువ్వు... చిరునవ్వు లా... బాధాతప్త వీచిక లా... సంభ్రమాశ్చర్య హేల లా... రౌద్ర జ్వాల లా... శృంగార గీతిక లా... కరుణార్ద్ర కవనం లా... నా లా... నాలో మెసిలే ఆత్మ లా... నీలో మెదిలే మనసులా... నేనూ అచ్చం నీలా...నువ్వు నేను ఒకరికొకరు సమర్పించుకున్న బహుమతిలా... నువ్వు నేను వేరు కాని శరీర ఆత్మ ల సంధానం లా...  విభజన సాధ్యపడని అణువు తప్పనిసరిగా విస్ఫోటకం చెందితే చెదిరిన శకలాలుగా... ఈ విశాల విశ్వంలో తిరిగి మనని మనమే శోధించి పట్టి ఏకాత్మగా మిగలాలని దేహాల్ని లయం చేసేసి భస్మమవ్వాలని సంసిద్దమైనవా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హంస గీతి

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 18-05-12 03:54:00

';;; ;;; లోయ గోడలు బీటలు పడ్డాయి పైనుండి జారే పిలుపుకి ప్రతిధ్వని కొదవైంది ఏ పిట్ట నోటికూడు నేలపాలైందోవేళ్ళాడుతున్న వెర్రి చెట్ల జాతరల్లే ఉందికిక్కిరిసిన వేళ్ళు గోడ మీద బల్లుల్లా పాకుతున్నాయివెన్నెల పిల్లలు కొందరక్కడ దాగుడు మూతలాడుతున్నారుచీకటి చేతులకి అందకుండా పరుగులు తీస్తున్నారుగుట్టుచప్పుడు కాకుండా ఆవాసం ఉన్న సరస్సులోయలో అలలు ఉగ్గబట్టుకుని ఉందిఇన్నాళ్ళకి ఒక హంస గీతి ఒకటి పైకి ఎగిసిందిఉలికిపడ్డ సరస్సులో వెన్నెల ఊయలూగిందిచెదిరిపడ్డ ఆకుల పక్క మీద చిందిన చివరి కూతఅచ్చంగా ‘వలిభి ర్ముఖ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

"నెంబర్ వన్ పుడింగి" మీద సమీక్ష కాని అభిప్రాయం

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 30-04-12 06:36:00

'కథల మీద సమీక్షలుంటాయి. స్వీయకథల మీద సమీక్ష లేముంటాయి. అవి రాసిన వ్యక్తుల మీద ఏర్పడే అభిప్రాయాలుంటాయి తప్ప. ఈ పుస్తకం వెలువడిన కొత్తల్లో వచ్చిన ప్రతిస్పందన చూసాక "చెడ్డ పుస్తక"మేమో నిజంగా అనుకున్నాను. దీని జోలికి పోలేదు. కానీ కనకప్రసాద్ ఎప్పటికీ పూర్తికాని ఆ మాయదారి "మూడు లాంతర్లు"లో పదే పదే "నామిని నామిని" అంటుండటం చూసాను. ఆయన కథల మీది సదభిప్రాయం కొంత ఆయన అభిరుచుల మీదా పాకటంతో చూద్దాంలెమ్మని దీన్ని కొన్నాను. ఇదివరకూ రెండు మూడు కథల్ని మినహాయిస్తే, నేను ఒక నామిని పుస్తకం పూర్తి చ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అప్పగింతలు

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 20-04-12 04:46:00

';;; తడికళ్ళ కాటుక అమ్మ చెంగుకి అద్దుతూ,ఓ పాపాయి చెప్పిన ఉక్రోషపు ఊసులక్కడక్కడాతేలుతున్నాయి వెక్కిళ్ళ వరదలో పాలల్లో ముంచి తీసిన గుప్పెళ్ళలో కన్నీటి ధారలు దాచి, తరలిపొమ్మంటూ అప్పగింతలతో అతలాకుతలం అయిన ఓ అమ్మ నిన్న మొన్నల వరకు నిద్ర మరిచిపోయిందిచల్లబడ్డ నుదుట కుంకుమ దీపశిఖలద్ది సాగనంపాక, కాంతి కొరవడిన ఓ బతుకులో తోడు కొరకు తడుములాట మొదలైనట్లేఈ గాలి ఏ దుఃఖపు వార్త మోసిందో ఆ మబ్బు వరకువాన చుక్కలు నేల రాలుతున్నాయి,వాడిన పూవొకటి కొమ్మని గట్టిగా పట్టుకుని ఊగుతుందికలల్ని, కథల్ని కొంగు పట్టి (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాన్నా పులి వచ్చే!!!

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 13-04-12 03:46:00

';;; చర్రుమంటున్న ఎండకి మండుతున్న వంటి బాధ తెలియట్లేదు.  తలలోంచి కారుతూ కళ్ళని మండిస్తున్న చెమట తుడుచుకోవాలనీ తెలీట్లేదు. కానీ ఒక్కటి మాత్రం తెలిసిపోతుంది - ఇక కొద్ది నిమిషాల్లో ఏమి జరగనుందో.  తన ఎదురుగా ఉన్న జీవాల కళ్ళు స్పష్టం గా చెప్పేస్తున్నాయా విషయాన్ని.  తనకీ వాటికీ మధ్యలో ఉన్న దూరం మహా అయితే పాతిక అడుగులు.   చుట్టూ ముళ్ళ పొదలతో,  విరిగి పడిన ఎండు కొమ్మలు, రాలిన ఆకులతో, కొనదేలిన రాళ్ళతో బాట అనేది కానరాని దుర్గమారణ్యం.  కాని, ఇదేమి చిత్రం - తన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాణిబంధం

రచయిత : సంహిత      బ్లాగు : కలం కలలు      టపా తేది : 03-04-12 13:54:00

';;; కిటికీ అవతల కొమ్మల్లో విశ్రాంతి తీసుకుంటున్న నీరెండ  కిటికీ గట్టు మీది కుండీలో మొక్క నీడ గది మధ్యననా వ్యాహ్యాళికి సమయం,  చివరి గుక్క తేనీరు, చేతిలోని దినపత్రిక నెమ్మదిగా జారవిడిచి,గుమ్మం దాటటానికి ఉద్యుక్తుడనయ్యాను…“మర్చిపోయారా?”  మందలింపులో చిరుకోపం చలవ కళ్ళజోడు చేతికిచ్చిన స్పర్శలో ‘అమ్మ’దనంపది, పాతిక, వంద... అడుగులు లెక్క పట్టుకోవటం అదో వెర్రి హాయిదోవపక్కన వేప చెట్టుకి ఏడాది పొడుగునా ఏదో ఒక పనిసర్వకాల సర్వావస్థల్లోనూ అది ఏదో ఒకటి రాలుస్తూనే వుంటుంది. ఆకులూ, పూ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం పూర్తి కథ pdf

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 23-03-12 06:36:00

'"మిత్రభేదం" కథ ధారావాహికకు అనువైంది కాకపోయినా, యీ బ్లాగరు మాధ్యమ పరిమితి వల్ల భాగాలుగా విడదీసి ప్రచురించాల్సివచ్చింది. ఒకే విడతలో చదవగలిగే కథ కాదు గానీ, చదువుతున్నపుడు యెక్కడ ఆపి మళ్ళీ యెక్కడ అందుకోవాలన్న నిర్ణయం చదువరికే వదిలేయాల్సిన కథ. అందుకే కథని pdf ఫైలుగా చేసి క్రింది లింకులో వుంచుతున్నాను. "రంగు వెలిసిన రాజుగారిమేడ కథ" కూడా దీనితో సంబంధమున్నదే కనుక దాన్ని కూడా ఫైలు చివర్న జత చేసాను (93వ పేజీ నుండి). మిత్రభేదం pdf అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం (ఆఖరిభాగం)

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 21-03-12 01:54:00

'ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం |ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | సోషల్ టీచరు ప్రసంగం ముగియడంతో, అప్పటికి వుపాధ్యాయులందరి ప్రసంగాలూ పూర్తయ్యాయి. కానీ ఆయన కూర్చునేవాడు వూరకనే కూర్చోకుండా, విద్యార్థులు ప్రస్తుతం యెవరెవరు యేమేం చేస్తున్నారో ఒక్కొక్కర్నీ లేచి చెప్పమన్నాడు. అది విన్నాక కొందరు కుంచించుకుపోతే, కొందరు వుత్సాహాన్ని వుగ్గబట్టుకున్నారు. భద్రీ యేదో గొణుక్కున్నాడు. ముందు ఆడవాళ్ళతో ప్రారంభమైంది. వరసగా యిద్దరు-ముగ్గ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం (పదవభాగం)

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 20-03-12 02:33:00

'ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | ( 2 )అందరికీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం మొదలై చాలాసేపయింది గానీ, శేషూకి యింకా మొదలవనట్టే వుంది. రేణూ యింకా రాలేదు. వస్తుందన్న ఆశ క్షణక్షణానికీ సన్నగిల్లుతోంది. చివరికి యిక ఆమె రాదన్న సంగతి ఒప్పేసుకుని, యింటికి వెళ్ళి కలవాలన్న నిశ్చయాన్ని బలపరుచుకుంటూ, వున్నట్టుండి నిస్సారమైన వర్తమానంలోకి మెల్లగా సర్దుకుంటున్నాడు.వేడుక తరగతి గదిలోనే జరుగుతోంది. బల్లలు పేర్చి&(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం (తొమ్మిదవభాగం)

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 19-03-12 02:35:00

'ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం |శేషూ నగరం చేరిన కొన్ని నెలలకే అతని కుటుంబం కూడా పూర్తిగా అక్కడికి మకాం మార్చేసింది. అతను మొదట్లో కొత్త స్కూల్లో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఊరి బడిలో తనకి వున్న హోదాని యిక్కడ అవలీలగా సంపాదించగలననుకున్నాడు. కానీ చాలా యెదురుదెబ్బలు తగిలాయి. తరగతి అగ్రశ్రేణిలో భాగం కావడానికి వట్టి చలాకీతనం సరిపోలేదు. మార్కులు కూడా కావలసి వచ్చాయి. అవి వుంటే చాలు చలిమిడిముద్దగాళ్ళు కూడా క(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం (ఎనిమిదవభాగం)

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 18-03-12 02:43:00

'ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం | ఏడవభాగం | అనుకున్న ప్రకారమే మరుసటి రోజు బడి మానేసాడు. కాని ఇంట్లోనే వుంటే సుబ్బరాజుగారి పాలేరుకి దొరికిపోతాడేమోనని భయమేసింది. ఎందుకన్నా మంచిదని పూసావోడి పడవెక్కి వాడితో పాటూ తిరిగాడు. సాయంత్రమయ్యేసరికి బాలా వచ్చి యేవీ జరగలేదని చెప్పాడు. రేణూ మామూలుగానే వుందట. బాలా కదిపితే మామూలుగానే మాట్లాడిందట కూడా.శేషూ మర్నాడు వుత్కంఠగా బడికి వెళ్ళాడు. ఎప్పుడూ లేని ఆత్రుతతో రేణూ రాకకై యెదురుచూసాడు. ఆమె పు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిత్రభేదం (ఏడవభాగం)

రచయిత : మెహెర్      బ్లాగు : కలం కలలు      టపా తేది : 17-03-12 03:45:00

'ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం | ‘అది జరగక ముందూ’, ‘అది జరిగిన తర్వాత’ అంటూ జీవితాన్ని రెండు ముక్కలుగా విడగొట్టే సంఘటనల్లో చాలావాటికి ముందస్తు శకునాలేవీ అందవు. శేషూ విషయంలోనూ అంతే. నిజానికి ఆ భీష్మేకాదశి రోజు వేరే రకంగా గుర్తుండిపోతుంద నుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు జనార్దనస్వామి రథోత్సవంలో తొలిసారి రథం చిటారు కొమ్ము దాకా యెక్కగలిగాడు. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ యెత్తుకి కళ్ళు తిరగుతాయన్నది ఒక కారణం. యాభై అడుగుల రథం మనిషెత్తు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 2 1 2 తరువాత తుది పుట

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦