Skip Navigation Links


పార్లమెంట్‌కు అరవై ఏళ్లు.. సాధించింది సన్యాసం

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 13-05-12 05:05:00

'అది 1952 మే13... భారత దేశంలో ఓ కొత్త శకం ఆరంభం.. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న నేతలు ఇక్కడే కొలువు తీరారు... ప్రజలు ఏ విశ్వాసంతో తమను ఇక్కడకు పంపారో... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనే వేదిక ఇది. ఇప్పటిలా అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలుగానీ.. బ్రేకింగ్ న్యూస్ కానీ లేవు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాత్రి రేడియోలో వచ్చే వార్తల్లోనే.. అదీ సంపన్న వర్గాలకే సాధ్యం. అయినా మన నేతలు ప్రజలకేం కావాలో అవి చర్చించి మరీ సాధించుకునే వారు.. మైకులు విరిచేయడాలు.. వెల్‌లోకి దూసుకెళ్లడాలు... ప్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అమ్మను గుర్తుంచుకునేందుకు ఇదా పద్దతి..

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 13-05-12 01:16:00

'మాతృదినోత్సవం ఎందుకు అమ్మను మర్చిపోతే కదా.. కన్నీళ్లలోనూ.. కలవరపాటులోనూ గుర్తొచ్చేది అమ్మేకదా.. ఆఖరుకు బూతులు తిట్టే వెదవల నోళ్లలో నానేది కూడా తొలుత అమ్మ పదమే.. అందుకే మర్చిపోలేని అమ్మను గుర్తు చేసుకునే మాతృదినోత్సవం గురించి మీరేమంటారు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే)

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 12-05-12 13:51:00

'మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే) అమ్మ... భాషకు అందని భావం... తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు....కనిపించే దైవం అమ్మ........ఆదిగురువు అమ్మే....అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది....ప్రపంచీకరణ మార్పుల వెల్లువలో కూడా అమ్మ బంధం చెక్కు చెదరలేదంటే అది అమ్మ ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే...మదర్స్ డే సందర్భంగా ప్రేమామృతాన్ని కురిపించే మాతృమూర్తిపై హెచ్ యం టీవి అందిస్తోన్న ప్రత్యేక కథనం.... సృష్టికి మూలం అమ్మ.. సృష్టిలో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బ్లాక్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా.. సాక్షికి జర్నలిస్టుల శాపం తగిలింది. జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..?

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 11-05-12 14:32:00

'జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..? బ్లాక్ డే అంటూ సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో ఈ రోజు బేనర్ పెట్టుకుంది. వాస్తవానికి సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు.. కానీ ఈ రాష్ట్ర్రంలో ఉన్న జర్నలిస్టులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే బ్లాక్ లిస్టులో చేరిపోయారు. చిన్న పత్రికలన్నీ చాలా వరకు కూడూ గుడ్డా లేకుండా రోడ్డున పడ్డాయి. రెండు రూపాయలకే చాటెడు చెత్త అందిస్తానని చెప్పుకొచ్చిన సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు. కానీ వార్తా పత్రికలేమన్నా. భగవద్గీతలా.. ఖురానా.. బైబిలా వ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 11-05-12 14:03:00

'రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న పుతిన్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా పనిచేయడం ఇది మూడో సారి. పుతిన్‌ను అధ్యక్షుడిగా చేసేందుకు రష్యా రాజ్యాంగాన్ని కూడా మార్చారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఆయన నాలుగేళ్లపాటు దేశ ప్రధానిగా పనిచేశారు. సోమవారం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రగతిశీల ఉద్యమ యోధుడు... రాలిన మొదుగు మొగ్గ... జార్జిరెడ్డి ఎవరు?

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 07-05-12 14:21:00

'ప్రగతిశీల ఉద్యమ యోధుడు రాలిన మొగ్గలు జార్జిరెడ్డి ఎవరు? ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 40 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే! అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు. జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

విజృంభిస్తున్న మావోలు... విస్తరిస్తున్న వసంత మేఘం

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 07-05-12 14:09:00

'విజృంభిస్తున్న మావోలు విస్తరిస్తున్న వసంత మేఘం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వీరంగం ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న నక్సల్స్ కేంద్రం చెలగాటం రాష్ట్రాలకు ప్రాణ సంకటం విచ్చల విడిగా గిరిజనులను అరెస్ట్ చేయడమే కారణం దేశంలో మావోయిస్టులు బలపడుతున్నారు. కేంద్రం అనుసరించే విధానాలు... ఏజన్సీలో తవ్వకాలు గిరిజనుల మనుగడకు ముప్పుగా మారాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ మనుగడ కెోసం గిరిజనులు మావోయిస్టుల మార్గాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టుల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఏజ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అడవిలో అసలేం జరిగింది...? కలెక్టర్ విడుదలకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది.

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 07-05-12 12:11:00

'మావోయిస్టులు ప్రభుత్వాధికారిని అంత తేలికగా వదిలేయడం వెనుక మతలబు ఏంటి? మధ్యవర్తులుగా వెళ్లడానికి మనీష్ కుంజం, ప్రశాంత్ భూషణ్ ఎందుకు నిరాకరించారు. మావోయిస్టులను రూపు మాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పించడం ... నిద్రపోతున్న పులిని లేపినట్లయింది. ప్రభుత్వం వరుసగా గిరిజనుల పై దాడులు, అరెస్టులు జరపడం మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో.. అటు ఒరిస్సాలో ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇటు చత్తీస్‌గ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లే అవుట్ లేకుండానే గేట్ కమ్యునిటీలు రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 06-05-12 15:52:00

'సామాన్యుల నోళ్లలో మన్ను ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకవైపు తెలంగాణ వాదంతో రాష్ట్రం రావణ కాష్టంలా మండుతుంటే.. ఇటు ఆంధ్రా ప్రాంతానికి మూటా ముల్లె సర్ధుకునే జనం ఆంధ్రలో కుప్పలు తెప్పలుగా స్థలాలు కొంటున్నారు. దీంతో రేట్లు చుక్కల్లోకెక్కాయి. ఈ ప్రభావం ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దున ఉన్న ఖమ్మం పై పడింది. అంతే కాదు ఇదే అదును చేసుకొని కొందరు స్వార్ధ పరులు సామన్య ప్రజలను నానా కష్టాలు పెడుతున్నారు. వాస్తవానికి ఖమ్మం రూరల్ అర్భన్‌లో సర్వేయర్ల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 06-05-12 15:46:00

'కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు అనుమతులు లేని కళాశాలల్లో విద్య ఓ మిద్య సౌకర్యాలన్నీ బ్రోచర్లలోనే... ఆచరణలో అయోమయం విద్యార్ధినిల పై లైంగిక వేధింపులు... చెబితే పరువు నష్టం కలెక్టర్ మాట పెడచెవిన పెట్టి పాత బస్సులు తిప్పే యాజమాన్యం షిఫ్టింగ్ పర్మిషన్ లేకున్నా.. అందమైన అద్దె భవనాల్లో నిర్వహణ ఓపెన్ స్టడీ పేరుతో ఓపెన్ గా దోపిడీ అందమైన విద్యార్దినులను మోడళ్లుగా చూపే కాలేజీ హోర్డింగ్‌లు ఆ కాలేజీకి అన్ని మార్కుల రావడం వెనుక అసలు రహస్యం స్టూడెంట్స్ ఏటీఎం కార్డులన్నీ కళాశాల య(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం..

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 03-05-12 17:49:00

'ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం.. ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వాళ్లలా మారుతున్న యువత నిత్యం మత్తులో మునికి చిత్తైతున్న జీవితం ఈ రాష్ట్రంలో మంచినీళ్లకు నిత్యం కరువు... ప్రతి సంవత్సరం పోటుగాళ్లమని చెప్పుకునే కుహనా రాజకీయ వేత్తలు.. కన్నీళ్లు తీరుస్తాం.. దాహం తీరుస్తామని.. ఆ ఎన్నికలపుడు గొంతులో కాసిన్ని మందు నీళ్లు పోసి ఓట్లు రాల్చుకుంటారు. కానీ ఆ ఒక్కరోజు మందుతాగి బృహన్నల గాళ్లకు ఓట్లేసిన ఓటరు కనీసం ఊహించలేడు.. మళ్లీ ఐదేళ్ల వరకు మన గుమ్మం వైపు తొంగి కూడా చూడడని. భవిష్యత్తులో మందు దొరుక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భాను పోలీసులకు ఏం చెప్పాడు ? సూరి హత్య వెనక దాగిన రహస్యం (ఒరిజినల్ స్టోరీ)

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 28-04-12 07:48:00

'భానుకిరణ్... ఈ పేరు చెబితే రకరకాల ఊహాగానాలు వెల్లువలా పెల్లుబికుతున్నాయి. భాను సూరిని నమ్మించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడని... హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉహాగానాలన్నీ వాస్తవాలేనా... అసలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో భాను ఏం చెప్పాడు ...? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్నాయి... ఈ ప్రశ్నలన్నిటీకి సమధానాలు హెచ్ఎంటీవీ చేతికి చిక్కాయి. పోలీసులకు భాను ఏం చెప్పాడో చూద్దాం.. భాను పోలీసులకు ఏం చెప్పాడు..(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బంగారు లక్ష మేన్ కు శిక్ష... శిక్ష వెనుక దాగిన కుట్ర

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 28-04-12 04:19:00

'బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. 11 ఏళ్ల క్రితం నకిలీ ఆయుధ డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న వ్యవహారాన్ని తెహల్కా డాట్ కాం బయట పెట్టింది. ఇన్ని సంవత్సరాల తరువాత కోర్టు బంగారు లక్ష్మణ‌్ దోశిత్వాన్ని నిర్ధారించింది. ఈ అపరాదానికి గానూ బంగారు లక్ష్మణ్‌కు శిక్ష విధించింది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కటకటా వెనక్కు వెళ్లాల్సినంత నేరం ఏం జరిగింది. అసలు బంగారు లక్ష్మణ్ చేసిన నేరమేంటి.. కేసు పూర్వా పరాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం అది బీజేపీ దేశా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భార్య శవంతో శృంగారం.. ఈజిప్ట్ లో శవ సంపర్కం.. చె/కొత్త చట్టం

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 27-04-12 05:55:00

'భార్యంటే కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యోషు మాతా అని వర్ణిస్తారు. ఏడడుగులు వేసిన రోజు నుంచి జీవితాంతం తోడు నీడగా నడిచిన భార్య తోడు బాసి పోతే ఆ శోకం తీరనిది. .. తన సహచరి రేపటి నుంచి కనిపించదన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుమిలి కుమిలి ఏడ్చే క్షణాలవి. కానీ ఈ విషాద క్షణాల్లో కదలని కట్టెలాగా పడి ఉన్న భార్యతో శృంగారాన్ని అనుమతించాలని ఈజిప్ట్ సర్కారు కొత్త చట్టం తెస్తోంది. ఈ చట్టం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సర్కారు ఇదేమీ పట్టించుకోకుండా కొత్త వివాదానికి తెరలేపింది. ఈజిప్ట్ అంట(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భారత్‌ పరువు తీసిన గణాంక సంస్థలు- అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 26-04-12 04:49:00

'మన్మోహన్ సర్కారు అసమర్ధ సర్కారని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. రాజకీయాలు మన్మోహన్ సింగ్ ను బలహీనుడిగా తయారు చేశాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రభ తగ్గింది. ఆర్ధికసంస్కరణల జోలికి పోకుండా ప్రజాకర్షక బడ్జెట్‌లతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఏజన్సీలు ఎద్దేవా చేశాయి. దీంతో ఆర్ధిక వృద్ధి కుంటుబడటమే కాకుండా దేశం పూర్తిగా వెనకబడుతోందని అభిప్రాయపడ్డాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే రేటింగ్ మరింత తగ్గిస్తామని ఏజన్సీలు హెచ్చరించాయి. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వందేళ్ల సినిమాలో ఒడిదుడుకులు.. వందేళ్ల సినిమాకు వందనాలు

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 16-04-12 08:42:00

'ఆ సాయంత్రం ముంబయిలోని ఒలంపియా థియేటర్ ముందు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఓ అద్భుతానికి పునాదులు పడబోతున్నాయి. అయితే అది విజయవంతంగా మారుతుందా లేదా అనేది అందరి మదినీ తొలుస్తున్న ఉత్కంఠ.. అక్కడ ఉన్న వారంతా ఒక చారిత్రాత్మక సంఘటనకు సాక్షులు. చిత్ర రూపకర్త దాదాసాహెబ్ ఫాల్కే తన ఎన్నో ఎళ్లుగా నిరీక్షిస్తున్న కలను సాకారం చేసుకోవడాన్ని అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. దాదాసాహెబ్ స్వదేశీ నిర్మిత పూర్తి నిడివిగల చిత్రాన్ని నిర్మించగలిగారు. ఇది చరిత్ర(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నైజీరియాలో పుడితే ఎయిడ్స్ తప్పదా..?

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 14-04-12 18:44:00

'దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విజృంబిస్తోంది. మొత్తం జనాభానే తుడిచేస్తుందా అనేంతటి భయంకర గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నైజీరియా అత్యున్నత అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా పుట్టిన శిశువుల్లో సుమారు 70 వేల మందికి హెచ్ఐవీ సోకినట్టు తేలింది. వీరితో బాటు అనేక మంది గర్భిణిలకు హెచ్ఐవీకి సంకేతంగా క్షయ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలిపారు.ఆఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుందనేది ఎప్పటి నుంచో వింటున్న విషయమే... కానీ తాజా అధ్యయనాలు చూస్తే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భౌషా ఇప్పుడు అంబేడ్కర్ కంటే... ఒక జార్జిరెడ్డి సమాజానికి అత్యవసరం

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 14-04-12 17:55:00

'ప్రవహించే ఉత్తేజాలకు పురుడు పోసే ఉస్మానియా శిఖరంలో పుట్టిన ఉద్యమ ధృవతార జార్టిరెడ్డి... అణగారిన అట్టడువర్గాల ప్రతినిధి అంబేడ్కర్.. యాదృచ్ఛికంగా ఈ రోజే ( 14 ఏప్రియల్) జార్జిరెడ్డి వర్ధంతి, అంబేడ్కర్ జయంతి ఒకే రోజు రావడం వల్ల ఉద్యమ స్ఫూర్తి రగిలించే రోజుగా మిగిలింది.. వాస్తవానికి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంబేడ్కర్ అవసరం ఇక లేదేమో అనిపిస్తుంది. అంటే దళిత బహుజనులు బాగుపడ్డారని... వెలివేత నుంచి.. అంటరాని తనం నుంచి బయట పడ్డారని కాదు... అంబేడ్కర్ లా ఆలోచించే చైతన్యం ఇప్పుడు ప్రతి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఉత్తర కొరియా యుద్ధోన్మాదం... కొరియా తలకొరివి... మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 10-04-12 18:52:00

'ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని తూర్పు ఆసియా దేశాలతో బాటు అమెరికా కూడా మండిపడుతోంది. ఉత్తర కొరియా చేసే ఈ ప్రయోగం.. అంతర్జాతీయ భద్రతా మండలి ఒప్పందాలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని అభిప్రాయ పడింది. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్‌ సంగ్‌ వందో జయంతి సందర్భంగా ఈ రాకెట్‌ ప్రయోగం జరపనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే ఉత్తర కొరియా ప్రయోగించే రాకెట్‌ నిబంధనలకు విరుద్దంగా ఉందని దాన్ని కూల్చడానికి కూడా వెనకాడేది లేదని జపాన్ గతంలోనే హెచ్చరించింది. ఉత్తర కొరియా మాత్రం తమ ప్రయోగం శాంత(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మవోయిస్టులను రూపుమాపే ప్రభుత్వ తాజా వ్యూహం

రచయిత : అయితగాని జనార్ధన్      బ్లాగు : JANARDHANPEN      టపా తేది : 06-04-12 16:30:00

'దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని రూపు మాపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అవలంబించబోతోంది. నక్సలైట్ ఉద్యమాల్లో ఎక్కువ శాతం గిరిజనులులే ఉంటున్నారనే ఉద్ధేశ్యంతో వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికను రూపొందించింది. గిరిజనులు వామ పక్ష తీవ్రవాద ఉద్యమాల వైపు మొగ్గు చూపడానికి.. వారు ఆర్ధికంగా, సామాజికంగా వెనకబడటమే కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారి అవసరాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించి.... వారిని ఉద్యమాల వైపు మళ్లకుండా చూసేందుకు.. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తోం(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦