Skip Navigation Links


తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 26-05-12 16:10:28

'తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4) ఆంధ్రులు ఆంధ్రులుగానే ఉండకుండా వారి రాజ వంశానికి పేరుగా సాతవాహన అనే పదాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఏ అద్భుత క్షణాలలో ఈ పదరూపకల్పన జరిగిందోగాని చరిత్రలో బహుళ ప్రసిధ్ధమై చిరస్థాయిగా ఈ పదం నిలిచిపోయింది. తరువాతి కాలంలో  ఈ పదం శాలివాహన, శాతవాహన గా రూపాంతరం కూడా చెందింది. ఇందులోని శాలివాహన పదంతో ఒక శకం ప్రారంభం జరిగింది. తొలి, అసలురూపమైన సాతవాహన పదం మహారాష్ట్రీ ప్రాకృత పదం. [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 25-05-12 18:05:52

'తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3) వేదాలకు సంబంధించిన పరిభాషలో ‘బ్రహ్మ’ అంటే మంత్రమనీ, వేదమంత్రాల వినియోగాన్ని విశదీకరించి, వివరించేవి కాబట్టి బ్రాహ్మణాలని పెద్దలు చెబుతారు. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందినది. సోమయాగ నిర్వాహణకు సంబంధించిన విషయాల విశదీకరణ ఐతరేయ బ్రాహ్మణానికి ప్రథాన విషయం. ఇది ఏకవ్యక్తికృతమనీ, ఆ వ్యక్తి మహీదాస ఐతరేయుడనీ సంప్రదాయ వచనం. ఇందులోని విషయం మొత్తం నలభై అధ్యాయాలుగా విభజించబడింది. ఈ నలభై అధ్యాయాలూ మళ్ళీ ఒక్కొక పంచికకు ఐదు అధ్యాయాలు [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : images 2012 (53) – “మార్పు!”

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 20-05-12 18:06:37

'“మార్పు!” ఒక్క రోజులో ప్రకృతి ఎంత మార్పుని కలిగిస్తుంది?…. ఇది చాలా పెద్ద ప్రశ్న, ఊహ కందనంత పెద్ద ప్రశ్న అనిపించవచ్చు. ఇలా కాకుండా, ఒక్క రోజులో ఒక  మొక్క పెరుగుదలలో ఎంత మార్పు కలుగుతుంది? అనుకుంటే! అవును, ఇది కాస్త ఊహకు అందుబాటులో ఉండే ప్రశ్న. Is quantitative imagination possible? Yes, it is possible! కొంత అస్పష్టంగా నైనా సరే!! అయితే, ఇందులో స్పష్టత కావాలంటే, తేవాలంటే? ఈ మార్పుని document చేయడం [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 19-05-12 10:00:16

'తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2) భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది. అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే. తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : images 2012 (52) – “ముందూ…వెనుకా…”

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 12-05-12 19:39:24

'“ముందూ…వెనుకా…” ముందూ…. వెనుకా…. ముందు వెనుకల మధ్యలో…. - and this is all about the (not so) fine art of focusing in (Digital) Photography!! పై images మీద ఎక్కడైన సరే క్లిక్ చేస్తే, ఆ images ని వాటి full dimensions లో చూడడానికి వీలవుతుంది. అప్పుడు focussing వలన images లో కలిగిన మార్పులు, images లో తేడాలను స్పష్టంగా చూడడానికీ వీలవుతుంది.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 12-05-12 18:03:42

'తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1) ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది. అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే, శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : images 2012 (51)- లోవెలుగు (లోపలి వెలుగు)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 12-05-12 15:56:54

'లోవెలుగు (లోపలి వెలుగు) పూవుకైనా, మరే ఇతర ప్రాణికైనా ఈ లోవెలుగు (లోపలి వెలుగు) సజావుగా ఉండడం ఎంతైనా అవసరం అనుకుంటాను! ఈ వెలుగు సరిగా ఉన్నంతకాలం అంతా సరిగానే ఉంటుందనుకుంటాను! ఈ వెలుగు క్షీణించడం  మొదలవడంతోనే, వృధ్ధాప్యమూ, క్షీణదశా మొదలవడం జరుగుతుందేమో, బహుశా, పూవుకైనా….మరే ఇతర ప్రాణికైనా!! లోపల, తొడెమ నుంచి పూవుగా మొదలైన చోట కాంతివంతంగా మెరవడం, అక్కడి నుంచి వెలుగు రెక్కలపైకి చిమ్మడం (reflect అవడం), అలా చిమ్మిన వెలుగు స్పష్టంగా పూవు [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : images 2012 (50) – దాగుడుమూతలు….

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 11-05-12 18:28:52

'దాగుడుమూతలు….(1) దాగుడుమూతలు….(2)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 11-05-12 15:10:15

'తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది. ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : Images 2012 (49) – “అందం చూడవయా…”

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 10-05-12 14:56:03

'అందం చూడవయా…… ఆనందించవయా…..ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు. అందం చూడవయా…. ఆనందించవయా…'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ : Images 2012 (48) – “చిటారుకొమ్మన…”

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 09-05-12 18:22:35

'చిటారుకొమ్మన….. చిగురాకులలో….. ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు! చిటారుకొమ్మన…. చిగురాకులలో….'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (12): పసితనమూ, పోయిన వసంతమూ….

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 08-05-12 18:22:53

'పసితనమూ, పోయిన వసంతమూ…. ఏ అనవసరపు ఆవేశానికీ లోనుకాకుండా నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను చూడలేనిది ఏదీ ఉండదు. పసితనమూ, వార్ధక్యమూ పత్రహరితమూ, పోయిన వసంతమూ అన్నీటినీ ఆ కన్ను అదే కరుణతో వీక్షిస్తుంది. వెలిగే దీపం చీకటి వాకిట్లో మరీ హుందాగా మెరిసేటట్లుగా అందం అప్పుడప్పుడూ ఒక్కొక సందర్భాన్నీ అంటిపెట్టుకుని ఉంటుంటుంది. అందువలన, … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (11): చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 07-05-12 14:43:08

'చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం) ఇంత తీయగా ఉంటుంది గనుకనే నీ జ్ఞాపకపు గాయాన్ని నేను ఎన్నటికీ  మానిపోనీయను. ఎక్కు పెట్టిన బాణానికి గురి తప్పడం కూడా తెలిసే ఉంటుంది. ఎడారికి దాహాన్ని గురించిన స్పృహ మొదటినుంచీ ఉంటుంది. ఎంత పకడ్బందీగా రాసుకున్నా విఫలం అయ్యే కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ  లాగా అయిన … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ:Images 2012(47)- పూవులు,రంగులు -’తెలుపు’

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 04-05-12 15:02:57

'పూవులు,రంగులు : ‘తెలుపు’'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (10): రంగుల కల -4

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 03-05-12 18:26:32

'రంగుల కల -4 ఏదైనా సరే  ఒక విలక్షణతతో విశ్వాన్ని సమ్మోహపరచాలని కాంక్షించే ప్రతి చిన్న పువ్వుకూ ఏదో ఒకనాటికి ఎవరిదో ఒకరి సాన్నిధ్యంలో కనులు మొగిడ్చి తన్మయానికి లొంగి పోయే తరుణం రానే వస్తుంది. గడ్డిపరక కైనా సరే, వెనక్కి వాలి, వెన్నిచ్చి, కనులు మూసుకుని కాస్త సేద దీరినపుడు నలిగి పోతున్నానన్న బాధకన్నా … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (9): రంగుల కల -3

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 01-05-12 18:45:41

'రంగుల కల -3 ఎందుకో గాని ఈ రంగుల ముందు నా మాటలు ఎప్పుడూ మౌనంగా వుండడాన్నే ఇష్టపడతాయి! అదెందుకో గాని విరిసినా విరియక ఉన్నా వాడినా పువ్వెప్పుడూ ఒక మధుర స్వప్నానికి ఆనవాలులాగానే ఉంటుంది. ప్రియమైన లోగిలి వైపుకు ఇంకా మొదలేకాని ఒకానొక కలల ప్రయాణంలోకి వేయ జూడబోయిన తొలి అడుగులా విరిసినా విరియక … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (8): రంగుల కల -2

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 30-04-12 15:11:20

'రంగుల కల -2 మనిషిగా ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ… ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ… ఉంటూ చూడడానికీ చూడబడడానికీ… ఈ రంగులదొక వింత లోకం. కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం ఒకానొక … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వగతాలు (7): రంగుల కల -1

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 29-04-12 18:35:09

'రంగుల కల అవును, ఇది ఒక రంగుల కల! ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది. ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది. తల వంచుకుని నడుస్తూనే ఉంటామా… … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కీసరగుట్ట

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 27-04-12 18:57:36

'కీసరగుట్ట హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం. క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం … Continue reading →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫొటోగ్రఫీ: Images 2012 (46)

రచయిత : venkat.b.rao      బ్లాగు : వెంకట్.బి.రావు's Blog      టపా తేది : 24-04-12 14:14:24

'సీతాకోకచిలుకలు'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


BVenkata prasad(7)

liferisk(3)

gdurgaprasad(2)

Ajit Kumar(2)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(2)

C.Chandra Kanth Rao(2)

kn murthy(2)

Anu Radha(2)

NS Murty(1)

Ajit Kumar(1)

Kasi Venkoba Rao (kasirao)(1)

Parakrijaya Pantula(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

మనోహర్ చిమ్మని(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

venkatesh gurrala(1)

వనజవనమాలి(1)

tank man(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

cbrao(1)

durgeswara(1)

Hyderabad Book Trust(1)

jeevani(1)

Bukya Sridhar(1)

Indian Minerva(1)

వేణూశ్రీకాంత్(1)

మాలతి(1)

a2zdreams(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

సత్యనారాయణ శర్మ(1)

Raagamayi(1)

SIVARAMAPRASAD KAPPAGANTU(1)

Rani(1)

కెక్యూబ్ వర్మ(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

SRRao(1)

SPLENDOR OF YOGA(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

సీత(1)

కంది శంకరయ్య(1)

anrd(1)

Chakradhar Sarma Rayapati(1)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

Srikanth K(1)

శ్యామలీయం(1)

కాయల నాగేంద్ర(1)

kastephale(1)

liferisk(1)

Sharma(1)

Rajasekhar Panigrahi(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦